ఆత్మహత్యల్లేని ట్రిపుల్ ​ఐటీగా మార్చుదాం : ఎస్పీ జానకీ షర్మిలా

ఆత్మహత్యల్లేని ట్రిపుల్ ​ఐటీగా మార్చుదాం : ఎస్పీ జానకీ షర్మిలా

 

  • మన ఆర్జీయూకేటీ -మన బాధ్యత
  • నిర్మల్​ ఎస్పీ జానకీ షర్మిలా పిలుపు

భైంసా/బాసర, వెలుగు: వరుస ఘటనల నేపథ్యంలో ఇక నుంచి ఆత్మహత్యలు లేని ట్రిపుల్​ఐటీగా బాసర ఆర్టీయూకేటీని మార్చుకుందామని నిర్మల్​జిల్లా ఎస్పీ జానకీ షర్మిలా పిలుపునిచ్చారు. వర్సిటీని ఆమె దత్తత తీసుకున్న తర్వాత తొలిసారి ‘మన ఆర్జీయూకేటీ -మన బాధ్యత’లో భాగంగా శనివారం ఉదయం వాకథన్​ నిర్వహించారు. శాతవాహన గ్రౌండ్​ నుంచి ఏకో పార్క్​ వరకు విద్యార్థులతో కలిసి కదం తొక్కారు.  

విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, జిల్లా పోలీసులు మీ వెంటే ఉన్నారని భరోసా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తనకు లేదా వీసీకి చెప్తే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, భద్రతను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. వీసీ గోవర్ధన్, వర్సిటీ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.